ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మేజర్ పంచాయతీ ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నూతనంగా ఉప సర్పంచ్ గా ఎన్నికైన తైదుల శివారెడ్డి పేర్కొన్నారు. అత్యధిక జనాభా గల ఆత్మకూరు మేజర్ పంచాయతీలో, ఉప సర్పంచ్ ఎన్నిక గురువారం ఆత్మకూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మరియు పంచాయతీ కార్యదర్శి శైలజ వార్డ్ మెంబర్ల సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నిక తీర్మానం చేయడం జరిగింది ఉపసర్పంచ్ తైదుల శివారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండల కేంద్రం తో పాటు, కుర్లపల్లి, పడమటి కొత్తపల్లి గ్రామాలు మేజర్ పంచాయతీ లో విలీనంగా ఉన్నాయి. మేజర్ పంచాయతీలు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు త్రాగునీటి ఎద్దడి, డ్రైనేజీ పారిశుద్ధ్యం, వీధి దీపాలు, గ్రామీణ పారిశుద్ధ ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, ఇందుకు సర్పంచ్ తో పాటు, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గం, సమిష్టిగా సహకారం అందించాలని, వీధుల్లో కానీ, గ్రామాల్లో కానీ, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, సమస్యల పరిష్కారం కోసం చేస్తానని నూతన సర్పంచ్ గా ఎన్నికైన , తైదుల శివారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ప్రస్తుతం కురుబ ఫెడరేషన్ డైరెక్టర్ పార్వతమ్మ మాట్లాడుతూ, యువనేత, సామాజిక సేవ దృక్పథుడు, రక్త ప్రదాతకు మార్గదర్శి అయినా తైదుల శివారెడ్డి, అందరి ఆమోదం మేరకు,మనకు ఉప సర్పంచ్ గా ఎన్నికవ్వడం, మన మేజర్ పంచాయతీ చేసుకున్న అదృష్టమని, మనం మేజర్ పంచాయతీ ప్రజల అదృష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ దుబ్బ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, యువకుడు, ఇదివరకే మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకున్న యువ నేత శివారెడ్డి ఉప సర్పంచ్ గా ఎన్నిక కావడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమలత వైస్ ఎంపీపీ విజయ్ వైస్ ఎంపీపీ నీలిమ యూత్ మండల కన్వీనర్ గులి కొండారెడ్డి పని రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి బాల పోతన్న వన్నూరప్ప వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు










