Jul 12,2023 14:41

ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలోని చింతకుంట గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం పి.వెంగమ నాయుడు 26వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శిడి. పెద్దయ్య మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు పి వెంగమ నాయుడు 20 సంవత్సరములు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు వీరు పూర్తి పేరు పెనకల పాటీ వెంగమ నాయుడు హనుమంతప్ప బాలమ్మ దంపతులకు 26 -08-1926తేదీన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చీమల వాగు పల్లి గ్రామంలో వీరు జన్మించారు. భార్య శ్రీమతి నారాయణమ్మ. చీమల వాగు పల్లెలో ఐదవ తరగతి వరకు చదివి ఆ తర్వాత సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకొని చదివి అర్థం చేసుకోగల స్థితికి చేరుకున్నారు 1950 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1950కి ముందు కమ్యూనిస్టు పార్టీ నిషేధంలో ఉన్న రోజులలో కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఇంట్లో ఆశ్రమం ఇచ్చి. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేసేవారు. వెంగమ నాయుడుది చిన్న రైతు కుటుంబం. మొదట స్వగ్రామానికి 10-15 కిలోమీటర్లు దూరంలో ఉన్న నాపరాయి గనులు నుండి నాపరాలను బండ్లు ఎత్తుకొని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బళ్లారిలో అమ్ముకునే నిమిత్తం వాళ్ళ నాన్న గారితో పాటు వెళ్లేవారు. దాంట్లో మిగిలిన పైకంతో నే జీవనాధారం. వారికి ఉన్న పది ఎకరాలు మెట్టు పొలాన్ని సొంతంగాసాగు చేసుకునేవారు వెంగమ నాయుడు అత్యంత ధైర్యశాలి ఎన్నోసార్లు శత్రువులు వారి నుండి బయటపడ్డాడు. ఎదురుగా శత్రువు వస్తున్న పిరికితనంతో పారిపోకుండా వాళ్లు నన్ను ఏమి  చేస్తారు. అది ధైర్యంగా ముందుకెళ్లేవారు వెంగమ నాయుడు చాలా నిరాడంబరులు. ఎంత దూరమైనా కాలినడకనే వెళ్లేవారు లేదా సైకిల్ వాడేవారు.