ప్రజాశక్తి-వెదురుకుప్పం : వెదురుకుప్పం మండలం దేవరగుడిపల్లి పంచాయితీలో గురువారం మండల తెలుగు దేశం పార్టీ క్రిష్టియన్ సెల్ అధ్యక్షలు చొక్కా మహేష్ , గ్రామకమిటి అధ్యక్షుడు ఎస్. చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమర్ రెడ్డిల ఆధ్వర్యంలో పంచాయితీ క్లస్టర్ ఇంఛార్జిలుగా చొక్కా అఖిల్, ఎల్ శివసాగర్, చొక్కా రాజేష్, ఎన్. మహేష్, శోభ, చొక్కా ఉమ మరియు ఎన్. ప్రసాద్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల క్లస్టర్ ఇంఛార్జి కె. చంగల్రాయులు రెడ్డి, మండల సీనియర్ నేత వెంకటాద్రి నాయుడు, మరియు అబ్జర్వర్ మిథున్ కుమార్ ల సమక్షమున క్లస్టర్ ఇంఛార్జి లను నియమించడం జరిగింది.










