ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మండల విద్యాశాఖ అధికారిణిగా స్థానిక విద్యా వనరుల కేంద్రంలో శ్రీమతి వై.వి.వసుమతీదేవి నూతనంగా బాధ్యతలు సోమవారం చేపట్టారు. ఈమె కార్వేటి నగరం మండలం లోని ఆర్ కె యస్ ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్చార్జి ఎం ఇ ఓ ఎం విజయ్ కుమార్ ఆమెకు చార్జెస్ హ్యాండ్ ఓవర్ చేశారు. మండలంలోని వివిధ సంఘాల నాయకులు వసుమతి దేవి ని అభినందిస్తూ దుస్సాలువతో సన్మానిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని పాఠశాలల అభివృద్ధికి, పిల్లల గుణాత్మక విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల సహకారంతో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తదనంతరం , వైస్ ఎంపీపీ రమణాసుబ్బయ్య, జడ్పిటిసి సుకుమార్ ఎంపీడీవో శ్రీ సుధాకర్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. మండల విద్యా వ్యవస్థను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసులు,దేశయ్య, పీతాంబర రెడ్డి,సుభాష్, కల్పన,లోకనాథం, పురుషోత్తం,భూపతిరెడ్డి, రామ్మూర్తి,గురునాథం, అమరావతి, డాక్టర్ బండి ప్రభాకర్ రెడ్డి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ మిట్టపల్లి మనీష్ రెడ్డి, సి ఆర్ పి లు గీత, మనోహర్, షణ్ముగం, ఇందిరా,సురేష్,అంకయ్య ఐ & టి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.










