ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు) : మండలం మొండివెంగనపల్లి గ్రామానికి చెందిన కందుకూరి హుమేష్ ను వెదురుకుప్పం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినట్లు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా.సురేష్ బాబు తెలిపారు. కందుకూరి హుమేష్ మండల యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పార్టీకి సేవలందించారు. అయన సేవలను గుర్తించి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినట్లు అయన తెలిపారు. ఈ సందర్భంగా కందుకూరి హుమేష్ గురువారం మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడంతో మరింత బాధ్యత పెరిగిందని, కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తానని, త్వరలో మండల కాంగ్రెస్ కమిటీ ని ప్రకటిస్తానని తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన జీడీ నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.నరసింహులు, పీసీసీ సభ్యులు పోటుగారి భాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కందుకూరి హుమేష్ కు ఈ పదవి రావడంతో కాంగ్రెస్ నాయకులు దాసురెడ్డి, జయచంద్ర, సులోచన, కిషోర్, వెంకటేష్, మునికృష్ణ, ప్రకాష్ రెడ్డి, పద్మనాభ రెడ్డి, నడిపి రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేసారు.










