ప్రజాశక్తి-వెదురుకుప్పం : వెదురుకుప్పం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కామసాని పద్మనాభరెడ్డి ఎన్నికైనట్లు, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు భరత్ మరియు ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం నాయకులు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నాపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవి ఇచ్చినా డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి రుణపడి ఉంటానని తెలిపారు.










