ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్:వ్యవసాయ కార్మికులకు సమగ్రమైన చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అన్నారు. ఆదివారం ఎంటిఎంసీ పరిధిలోని మెల్లంపూడిలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు బత్తుల సంసోను అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఈమని అప్పారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికుల రోజువారి వేతనం పెంచాలని ఆయన అన్నారు. అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలన్నారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మేల్లంపూడి గ్రామ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం బెల్లంపూడి గ్రామ అధ్యక్షులుగా కంచర్ల నాగేంద్రం, ఉపాధ్యక్షులుగా కంచర్ల మరియమ్మ, కార్యదర్శిగా ఈదులమూడి రాణమ్మ, సహాయ కార్యదర్శిగా ఈదులమూడి సుఖవేణి, మరొక 20 మందితో కమిటీ ఏర్పాటయింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కష్ణ, ఈదులముడి రాజారావు, ఈదులమూడి మార్తా, కంచర్ల పున్నయ్య, ఈదులముడి శ్యామల, పలగాని మల్లేశ్వరి, వనమా దీనమ్మ, పలగాని ముత్యాలమ్మ,, బొక్క ప్రమీల, ఎస్ గౌస్య, తదితరులు పాల్గొన్నారు.










