Aug 19,2023 00:56

వ్యవసాయ అభివృద్ధికి
అగ్రికల్చరల్‌ ల్యాబ్‌
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక నైపు ణ్యాన్ని పలువురు రైతులు చేస్తున్న వ్యవసాయ విధానాలను తెలుసు కొని తిరిగి అవలంబించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు ఆదర్శ రైతుల వ్యవసాయ క్షేత్రాలను కూడా పరిశీలించాల్సిన అవ సరం ఎంతైనా ఉందని జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు అన్నా రు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం చైర్మన్‌ పి.రామ చంద్రా రెడ్డిఆధ్వర్యం లో నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆదర్శ రైతులు లాభసాటి వ్యవసాయం నకు అను సరిస్తున్న మార్గాలు, అదే విధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను నేరుగా చూసి పరిష్కార మార్గాలను శాస్త్ర వేత్తల ద్వారా తెలియ జేయడం బాగుంటుందనన్నారు. ఈ సందర్భంగా రైతులకు కావాల్సిన సలహాలు ఇవ్వడం జరుగుతుం దని అలా చేయడం వల్ల మంచి ఉత్పత్తులు సాధించవచ్చునన న్నా రు. అదేవిధంగా జిల్లాలోని పలు పల్ప్‌ పరిశ్రమలలో వస్తున్న వేస్ట్‌ ను బందావనాలకు తరలించి సంపదను తయారు చేయడం ద్వారా పంచాయతీ లు ఆర్థికంగా అభివద్ధిచెందేందుకు ఉపయోగ పడ తాయని ఆ విధంగా తగు చర్యలు తీసు కోవడం జరుగు తుందన న్నారు. పలువురు సభ్యులు ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ మాట్లాడు తూ జాయింట్‌ కలెక్టర్‌ గారు వెల్లడించిన అభిప్రాయాలు అనుకూలంగా ఉన్నాయని ఆ విధంగా తగు చర్యలుతీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారు లను కోరారు. జిల్లాలో నగిరి, పలమనేరు లలో అగ్రికల్చరల్‌ ల్యాబ్‌ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని త్వరలో మిగతా వాటిని కూడా తీసుకు రావడం జరుగు తుందనన్నారు. రైతు భరోసా కేంద్రాలలో ఉద్యాన పంటలకు కావాల్సిన ఎరువులు, క్రిమి సంహారక మందులు నిల్వలు ఉంచడం అవసరమని అందుకు కావ లసిన ఇండెంట్‌ లను తయారు చేయాలని వ్యవసాయ,ఉద్యానవన అధికారులను కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకష్ణ మా ట్లాడుతూ జిల్లాలో ఈ క్రాప్‌ బుకింగ్‌ నూతన జియో కోఆర్డినేటర్‌ ద్వారా జరుగు తోందని అదేవిధంగా ప్రభుత్వానికి పంపిన ప్రతిపా దనలు మంజూరులుత్వరలో పలు పథకాలకు సంబంధించి రాను న్నాయని తెలిపారు. ఉద్యానవన అధికారి మధుసూదన్‌ రెడ్డి మాట్లా డుతూ మామిడి కాయల కోతల అనంతరం తీసుకోవాల్సిన యాజ మాన్య చర్యలు గురించి అవగాహనసదస్సులు నిర్వహించడం జరుగుతుందని రైతులు ఈ సదస్సులకు హాజరు కావడం ద్వారా మంచి ఉత్పత్తులు నాణ్యమైన దిగుబడి పొందే అవకాశం ఉంటుం దన్నారు. సమావేశంలో జెడి సెరికల్చర్‌ శోభ, జిల్లా పశు సంవర్థక అధికారి ప్రభాకర్‌, ఏడి మార్కెటింగ్‌ పరమేశ్వర్‌, ఎల్‌ డి ఎం హరీష్‌ సభ్యులు పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి, గోవర్ధన్‌ బాబి,శివ ప్రకాష్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.