Jul 09,2022 00:02

వ్యవసాయ దినోత్సవ సభలో మాట్లాడుతున్న జేసి వెంకటేశ్వర్‌

రైతు దినోత్సవంలో జాయింట్‌ కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 21శాతం నిధులను కేటాయించి వ్యవసాయ అభివద్ధికి అనేక చర్యలు చేపడుతోందని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవ కార్యక్రమంను వ్యవసాయశాఖ అధికారులు పూతలపట్టు నియోజకవర్గం మండలంలోని పి.కొత్తకోట గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పశుగ్రాస అభివద్ధికి చేపడుతున్న చర్యలు, సేంద్రియ వ్యవసాయం గురించి, వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న పలు పథకాలు గురించి సంబంధిత అధికారులు జాయింట్‌ కలెక్టర్‌కు వివరించారు. ఈసందర్భంగా రైతులకు సంబంధించిన పలు సమస్యలకు పరిష్కారం ఎలా తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రైతులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తన సరఫరా నుంచి పంట కొనుగోలు వరకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని గ్రామీణ స్థాయిలో ఇవి ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ రంగానికి ఎంతగానో ఉపకరిస్తున్నాయన్నారు. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో 21శాతం నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రంగంపై ఉన్న ప్రత్యేకతను చాటిచెబుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌తో పాటు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకష్ణ, పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటరావు, ఉద్యానవన అధికారి హరికష్ణరెడ్డి, సేంద్రీయ వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి పట్టు పరిశ్రమ అధికారులు, ఆర్‌బికె సిబ్బంది రైతులు పాల్గొన్నారు.