Mar 16,2022 23:06

మృతి చెందిన సయ్యద్‌ యూనస్‌



ప్రజాశక్తి- పుంగనూరు:
పట్టణానికి చెందిన అబ్దుల్‌ కాలేషా సాహెబ్‌ కుమారుడు అబ్దుల్‌ రహీం(48) దినసరి కూలీగా జీవనం చేస్తున్నాడు. అబ్దుల్‌ రహీం మంగళవారం కోలార్‌కు వెళ్లాలని ఇంట్లో చెప్పి బుధవారం స్థానిక విజయలాడ్జి వద్ద తలకు బలమైన గాయంతో మృతి చెంది ఉన్నాడు. మృతి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పట్టణానికి సమీపంలోని నక్కబండలో గల ఇస్లాంనగర్‌కు చెందిన రజాక్‌ సాబ్‌ కుమారుడు సయ్యద్‌ యూనస్‌(24) మంగళవారం కొండ సముద్రం గ్రామ సమీపంలో గల చెరువు వద్దకు చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.