Nov 17,2022 21:52

వ్యకాసం నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

వ్యవసాయ కార్మిక సంఘం చిత్తూరు జిల్లా మహాసభ స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో వ్యవసాయ కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మికులపై మహాసభలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం భవిష్యత్‌ కార్యక్రమాలను ఆమోదించారు. వ్యవసాయ కార్మికుల సమస్యలపై రానున్న రోజుల్లో పోరాటాలు తీవ్రతరం చేయాలని మహాసభ తీర్మానించింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా చిరంజీవిమ్మ, కార్యదర్శిగా హంగేరి ఓబుల్‌ రాజు కమిటీ సభ్యులుగా శివకుమార్‌, గణేష్‌, అమర నారాయణ, రాజగోపాల్‌, వెంకటరమణ, నిర్మల, ఎన్‌.రాజగోపాల్‌లను ఎన్నుకున్నారు.