Mar 07,2022 20:40

కమిటీ నాయకులను సన్మానిస్తున్న దృశ్యం.


టీడిపి వాణిజ్య విభాగ కమిటీ ప్రకటించిన నరసింహాయాదవ్‌
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపరస్ధులు ఎదుర్కోంటున్న సమస్యలపై పోరడడానికి టీడిపి వాణిజ్య విభాగం కమిటీ ఎల్లప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. 38 మందితో కూడిన తిరుపతి పార్లమెంట్‌ వాణిజ్య విభాగం కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా వి.వేణుగోపాల్‌ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా విశ్వనాధం నియమింపబడ్డారన్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.