Jul 31,2022 21:39

వ్యాపారస్తుల శ్రేయస్సే అసోసియేషన్‌ లక్ష్యం
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి:
మండలంలోని అన్ని రకాల వ్యాపారస్తులు శ్రేయస్సే మర్చంట్స్‌ అసోసియేషన్‌ లక్ష్యమని బైరెడ్డిపల్లి మండలం మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రవికుమార్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఓప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో వ్యాపారస్తులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరు వ్యాపారస్తులను ఒక తాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించడంలో యూనియన్‌ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. లాభార్జనే ధ్యేయంగా కాకుండా సేవాకార్యక్రమాలు చేయడంలో కూడా అసోసియేషన్‌ సభ్యులు చొరవ చూపాలన్నారు. పలమనేరు వ్యాపారసంఘం ప్రతినిధి చీరాల రాంబాబు మాట్లాడుతూ అన్నిరకాల వ్యాపారాలు చేసేవారు ఓకే యూనియన్‌గా ఏర్పాటవ్వడం మంచి పరిణామం అన్నారు. వ్యాపారస్తులందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని అన్నారు. అనంతరం పలమనేరు వికోట వ్యాపారస్తుల సంఘం ప్రతినిధులు రాజేష్‌, శివకుమార్‌లు వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ముందు స్థానికంగా ఏర్పాటు చేసిన మర్చంట్‌ అసోసియేషన్‌ కార్యాలయాన్ని యూనియన్‌ సభ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో మండల మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఉమాశంకర్‌, ఫైజుల్ల, విజరుకుమార్‌, వినరు, యశ్వంత్‌కుమార్‌, కష్ణమూర్తి, బాలాజీ, నాగేంద్ర, వ్యాపారస్తులు పాల్గొన్నారు.