Aug 27,2022 22:26

వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలి
ప్రజాశక్తి- కార్వేటినగరం:
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వసతి గహాల్లో కూడా మెనూప్రకారం నాణ్యమైన భోజనం వడ్డిస్తున్నారని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. శనివారం మండల పరిధిలోని కత్తెరపల్లి గ్రామంలో ఉన్న బీసీవసతి గహాన్ని ఎంపీడీఓ మోహన మురళీతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోను, వసతి గహాల్లోను పిల్లలకు ప్రభుత్వం అందించిన మెనూప్రకారం భోజనం వండి వడ్డించాలన్నారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అలాగే మరుగుదొడ్లు, విద్యార్థుల గదులను పరిశీలించి భోజన సౌకర్యాలను అడిగి తెలసుకున్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ పాఠశాల సమయం అనంతరం విద్యార్ధులు హాస్టల్లోనే ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక ట్యూటర్‌ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకతరగతులు నిర్వహించాలని సూచించారు. అనంతరం వసతి గహపరికరాలను పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ధనంజయవర్మ, కోఆప్షన్‌ మెంబర్‌ పట్నం ప్రభాకర్‌రెడ్డి, పురంధర్‌, ఆర్జునయ్య. శోభన్‌ బాబు పాల్గొన్నారు.