రూ.5 లక్షలు విలువ చేసే బంగారం అపహరణ
రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ బృందాలు
అనుమానిత వ్యక్తి అరెస్టు
డిఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు
ప్రజాశక్తి-వాల్మీకిపురం:
పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని విఠలం గ్రామంకు చెందిన క్రిష్ణారెడ్డి భార్య గంగిరెడ్డిగారి వెంకట లక్ష్మమ్మ (75) ఇంట్లో ఒకటే ఉంటుంది. దీనిని గమనించిన దుండగులు మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటలక్ష్మమ్మ గొంతుకోసి దారుణంగా హత్యచేసి, ఆమె శరీరంపై ఉన్న సుమారు రూ.5లక్షలు విలువచేసే బంగారు బొట్టు చైన్, 4గాజులు, జత కమ్మలు, ఓ ఉంగరం అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లె డిఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో సీఐ నాగార్జున రెడ్డి, ఎస్సై బిందు మాధవి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బందాలతో విచారణ చేపట్టారు. మతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సీఐ నాగార్జునరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.










