వరసిద్ధుని సేవలో జడ్పీ వైస్‌చైర్మన్
ప్రజాశక్తి- ఐరాల: స్వయంభు వరసిద్ధి వినాయకుని చిత్తూరు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బి.ధనుంజయ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిసేవలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో ధనంజయరెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ వేదపండితులు మంత్రోచ్ఛానులతో ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, పూలమాలతో సత్కరించి ప్రసాదం అందించారు. వైసిపి యువ నాయకులు తిమ్మిరి నరేష్, పాల్గొన్నారు.










