వరసిద్ధుని నిత్య అన్నదానానికి లక్ష విరాళం
ప్రజాశక్తి- ఐరాల: కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి నిత్యాన్నదానానికి హైదరాబాద్ వాస్తవ్యులు రమేష్ అనే భక్తుడు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. విరాళాదాతకు స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. వేద ఆశీర్వచనం మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు చిత్రపటాలు అందజేశారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.










