Sep 01,2022 21:51

వరసిద్ధుని బ్రహ్మోత్సావాలు ప్రారంభం
ధ్వజారోహణంతో అంకురార్పణ
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి- ఐరాల

కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో ఆగస్టు 31 నుంచి జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణం అత్యంత ఘనంగా జరిగింది. ఆగస్టు 31వ తేది నుంచి సెప్టెంబర్‌ 20వ తేది వరకు అంటే 21రోజులు పాటు జరుగునున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం కార్యక్రమంతో అంకురార్పణ జరిగింది. ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామసమీపంలోని ఉన్న మర్రిచెట్టు కింద భుదేవ తకు ప్రత్యేకపూజలు నిర్వహించి పుట్ట మన్ను చే కరించి (ముత్యం గ్రహణం) మంగళ వాయిద్యాల నడుమ గ్రామపురవీధులు గుండా ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. అలాగే ఆలయంలో సర్వశుద్ధి పుణ్యవచనం చేసి వాస్తు శాంతి గ్రామవాస్తు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంరార్పణ చేశారు. తరువాత ప్రధాన ఆలయంలోని ధ్వజస్తభం వద్ద మూషిక యాగం చేసి ధ్వజాపూజ, చేరి పూజలు చేశారు. ఈ సందర్బంగా ధ్వజస్థంభాన్ని వివిధ రకాల విదేశ పరిమిళ పుష్పాలతో మామిడి బొద్దెలు, మామిడి తోరణాలతో సర్వాంగసుందరంగా ఆలకరించారు. అనంతరం ఆలయ ఈఓ ఎంవి.సురేష్‌ బాబు, ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ ఎ.మోహన్‌ రెడ్డి, ఆలయ ఉపప్రధాన అర్చకులు ధర్మేఈశ్వర్‌ గురుకుల్‌ ఆధ్వర్యంలో బంగారు ధ్వజస్థంభాన్ని సచించి హారతిచ్చి బ్రహ్మ స్వయంగా దగ్గరఉండి స్వామివారికి నిర్వహించే బ్రహ్మౌత్సవాలకు అష్ట దిక్యాలకులు ముక్కోటి దేవతలను ఆప్యాయంగా ఉదయం స్వాతి నక్షత్ర యుక్త కన్యలగం గురువారం ఉదయం 8.15 నుంచి 9.15 గంటల మధ్య పుష్కరాలశా మంచు ఎగరవేసి స్తరమ విషణధ చేసి బంగారు ధ్వజస్తభంపై ప్రాణప్రతిష్టత చేశారు. అనంతరం ధ్వజస్థంభానికి నారికేళ, అభిషేఖం అన్నంతోదిపైరి కపాలికలను బలినిచ్చి, నైవైద్యం, దీపారాధన, మంగళహరతి నిర్వహించారు. ఈసందర్బంగా ధ్వజారోహణ కార్యక్రమానికి విచ్చేసిన ఆలయ ఉభయదార్లు, గ్రామపెద్దలు దేవస్థానం తరుపున పూలహారాలతో ఘనంగా సత్కరించారు. తరువాత సాయంత్రం యాగపూజలు నిర్వహించారు. ఈమేరకు ప్రధాన ఆలయంలో అనివేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాల ప్రవేశాన్ని శాస్త్రక్తంగా నిర్వహించి నవరాత్రిదీక్ష, హోం నిర్వహించారు. ఈసందర్బంగా ఆలయ ఉప ప్రధానఅర్చకులు ధర్మేశ్వర్‌ గురుకుల్‌, ఆధ్వర్యంలో అర్చకులు రాఘవేంద్ర, బాలసుబ్రమణ్యం, వేదపండితులు యగాలతో ఏర్పాటు చేసిన 108నామాలు కళాపూజ చేసి అగ్నిప్రతిష్ట పాకాయం నిర్వహించారు. ఆలయ ఈఓ సురేష్‌ బాబు, ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్‌ మోహన్‌ రెడ్డి, అర్చకులు స్వామి వారికి కళ్యాణధారణ చేశారు. స్వామివారి యగాశాలలో పూర్ణహుతి, అనంతరం మొదట కలశ పూజ నిర్వహించారు. ఈపూజలు కుంభాభిషేకం కన్నమాయటకర మైనదని శాస్త్రంలో తెలియజేస్తున్నాయి. ఈధ్వజరోహణం కార్యక్రమం సందర్బంగా ప్రధాన ఆలయంలోని గర్భాలయం, ఆంత్రాలయం, అర్ధమండపం, మూషిక మండపం, శుభద మండపం, యాగాలను వివిధ రకాల విదేశీ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ధ్వజారోహణం తరువాత ఉభయదార్లుకు, భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఏసీ కస్తూరి, ఆలయ ఉభయదార్లు, ఆలయ ఏఈఓలు విద్యాసాగర్‌, రవిప్రసాద్‌ రెడ్డి, హేమమాలని, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణిలతోపాటు ఆలయ ఉభయ దార్లు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వరసిద్ధినికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీ, విద్యుత్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు బుధవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టువస్తాల సమర్పించేందుకు విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డికి ఆలయ సాంప్రదాయ ప్రకారం మంగళ వాయిద్యాలతో ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదఆశీర్వచనం మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలు, శేషవస్త్రాలు అందజేశారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కాణిపాకంలో ఎంతో మహత్యం గల వినాయకస్వామివారు వెలిసి ఉన్నారని, స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్షేత్రం మరింత అభివద్ధి చెందాలని, రాబోయే రోజుల్లో రూ.150 కోట్లతో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసిన తర్వాత పెద్దఎత్తున భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత పెద్ద క్షేత్రంగా వెలుగొందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ఇందుకు స్థానిక శాసనసభ్యులు, చైర్మన్‌, ఈఓ కషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏకాంబరం, ఈఈ వెంకట నారాయణ, డిఎస్పి సుధాకర్‌రెడ్డి, ఇతర సంబంధితఅధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హంస వాహనంపై ఊరేగిన వినాయకుడు
కాణిపాకం శ్రీస్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో ఆగస్టు 31వ తేదీ నుండి జరుగుతున్న స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి హంస వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పరిమళ పుష్పాలతో రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై మంగళ వాయిద్యాలు నడుమ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు.