Aug 27,2022 22:23

వరసిద్ధిని సేవలో గల్లా అరుణకుమారి
ప్రజాశక్తి- ఐరాల:
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమర్‌రాజా సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయ ప్రకారం రాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూషిక మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాలు శేషవస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి. మాజీచైర్మన్లు జగన్నాథరెడ్డి, మనినాయుడు, కాణిపాకం మాజీ సర్పంచ్‌ మధుసూదన్‌ రావు, ఆలయ పర్యవేక్షణ కోదండపాణి, టెంపుల్‌ ఇన్స్పెక్టర్‌ రమేష్‌, ఆలయ సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.