Aug 27,2022 22:25

వరసిద్ధి వినాయకునికి 4 లక్షలు విరాళం
ప్రజాశక్తి- ఐరాల:
స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి నిత్యాన్నదాన పథకానికి శనివారం బెంగళూరుకు చెందిన కమ్మవారి సంగం ట్రస్ట్‌ సభ్యులు రెండు లక్షల రూపాయలు చెక్కురూపంలో విరాళంగా అందజేశారు. అలాగే శ్రీస్వామివారి గోసంరక్షణ ట్రస్ట్‌కు బెంగళూరుకు చెందిన లీలాశంకర్రావు ఒక లక్ష 116 రూపాయలు చెక్కు రూపంలో అందజేశారు. అదేవిధంగా స్వామివారి నిత్యాన్నదాన పథకానికి బెంగళూరుకు చెందిన యోగమూర్తి లక్ష ఒక రూపాయి చెక్కు రూపంలో దేవస్థానం చైర్మన్‌ మోహన్‌రెడ్డి చేతుల మీదకు అందజేశారు. వేరువేరుగా విరాళం అందజేసిన విరాళాధాతలకు ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆలయ ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి వేదఆశీర్వచం మండపంలో వేద పండితులచే ఆశీర్వాదం చేయించి తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయాధికారులు సిబ్బంది, మండల టిడిపి నాయకులు హరినాయుడు, మనీనాయుడు. మధుసూదన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.