Mar 24,2023 20:53

ప్రజాశక్తి - కాళ్ల
గ్రామ పంచాయతీలో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరణతో సంపద తయారీపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ రిసోర్స్‌ పర్సన్స్‌ కాశీ విశ్వనాథ్‌ తెలిపారు. మండలంలోని జక్కరం పంచాయతీకి చెందిన ఎస్‌డబ్ల్యూపిసి చెత్త సంపద కేంద్రంలో శుక్రవారం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా వర్మీ కంపోస్ట్‌ తయారీ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచి కూచంపూడి పద్మావతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ జిల్లాలో విస్సాకోడేరు, పెంటపాడు, జక్కరం మూడు గ్రామ పంచాయతీలను లోకల్‌ ట్రెయిుంగ్‌ సెంటర్లుగా గుర్తించామన్నారు. ఇఒపిఆర్‌డి ఎంవి.భాస్కరరావు మాట్లాడుతూ 14 గ్రామాలకు చెందిన గ్రామ కార్యదర్శులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వెటర్నరీ, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, క్లాత్‌ మిత్రలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రామన్నపాలెం గ్రామ సర్పంచి బందెల ఎలీషా, కొత్తాడ గ్రామ సర్పంచి పడవల సత్యనారాయణ, గొల్లవానితిప్ప సర్పంచి వెంకటేశ్వరరావు, ఉపసర్పంచి బుద్దాల రామకృష్ణ పాల్గొన్నారు.