ప్రజాశక్తి - క్యాంపస్ : వరల్డ్ సైంటిఫిక్ ఇండెక్స్-2022లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ దేవ ప్రసాదరాజుకు చోటు లభించింది. ఫిజిక్స్ ఫోటానిక్స్ - లేజర్స్ రంగంలో ప్రొఫెసర్ దేవ ప్రసాదరాజు చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ర్యాంకు లభించింది. ప్రపంచంలో ఒక లక్షా యాభై ఆరు వేల ర్యాంకు, ఆసియాలో 22 వేల ర్యాంకు, మన దేశంలో 2, 600 ర్యాంకు, ఎస్వీయూలో రెండవ ర్యాంకు పొందారు. కాగా, 2007లో ఎస్వీయూలో ప్రొఫెసర్ దేవ ప్రసాద్ రాజు అధ్యాపకులుగా చేరారు. ఇప్పటి వరకూ వీరి పర్యవేక్షణలో 11 పీహెచ్ డీలు, 2 ఎంఫిల్ డిగ్రీలు పూర్తి అయ్యాయి. పలు అంశాలపై 3 పుస్తకాలు రాశారు. వివిధ అంశాలపై ప్రోఫెసర్ దేవప్రసాద్ రాజు రూపొందించిన 100 పరిశోధనా వ్యాసాలు ప్రముఖ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. 60 జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజును అభినందించారు.










