మాట్లాడుతున్న వైసిపి నాయకులు
మాట్లాడుతున్న వైసిపి నాయకులు
వరికుంటపాడు జగనన్న
ప్రజాశక్తి-వరికుంటపాడు:గ్రామీణ ప్రాంతాలలోని పేదలందరికీ సకాలంలో వైద్యం అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమంనూ ప్రభుత్వం నిర్వహిస్తుందని సర్పంచ్ పేర్నం పాటి పెద్దమౌలాలి, ఎఎంసి మాజీ డైరెక్టర్ దాసరి యర్ర ఓబయ్యా అన్నారు. మండలంలోని తోటల చెరువుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం ఎంపీడీఓ చేవూరి శ్రీదేవి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్యంకు పెద్ద పీఠ వేశారన్నారు.కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గుంటుపల్లి రామాంజనేయులు, చెన్నంపల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ బొడ్డు వెంకటేశ్వరరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు జిలాని తదితరులు పాల్గొన్నారు.










