May 13,2023 22:14

ప్రజాశక్తి - కాళ్ల
              రబీ సీజన్‌లో రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి అండగా నిలుస్తుందని భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు చెప్పారు. మండల పరిధిలోని పెదఅమిరం, ఏలూరుపాడు గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. ఇటీవల అకాల వర్షాల వల్ల వరి కోతలు రైతులు వాయిదా వేశారు. ఏలూరుపాడులో 280 ఎకరాలు, పెదఅమిరంలో 450 ఎకరాలు వరి కోతలు చేయాల్సి ఉంది. రైతులతో ఆర్‌డిఒ దాసిరాజు మాట్లాడారు. త్వరగా వరి కోతలు పూర్తి చేయాలని రైతులకు సూచించారు. ఆయనతో పాటు ఎఒ జయావాసుకి, రైతులు పాల్గొన్నారు.