Jun 05,2023 15:26

ప్రజాశక్తి-గణపవరం : మండలంలో వరదరాజపురం గ్రామ సర్పంచ్ కొండేటి నరసింహమూర్తి 40 సోమవారం ఉదయం మృతి చెందారు. నరసింహ మూర్తి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న నరసింహమూర్తిని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు బ్రాకెట్లో వాసు బాబు గుంటూరు ఆసుపత్రికి వెళ్లి నరసింహమూర్తి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. చికిత్స పొందుతున్న నరశింహమూర్తి ఆరోగ్యం మెరుగుపడి త్వరలోమరలగ్రామానికి వస్తారని కుటుంబసబ్యులు ఆశించారు. అయితే నరశింహమూర్తి ఆరోగ్యం క్షీనించడముతో సోమవారం ఉదయం.6.గంటల కు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన ఆకాల మ్రుతికి ఉంగుటూరు శాసనసబ్యులు పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు)మండల సర్పంచుల చాంబర్  అద్యక్షరాలు చనుమూరి లక్షిబావాని, శివప్రసాదు, మండల వైసిపి నాయకులు తమ సంతాపాన్నితెలిపారు.