ప్రజాశక్తి - ఆచంట
దశాబ్ధాలుగా అభివృ ద్ధికి నోచుకోని ఆచంట పంచాయతీ పరిధి వంకతాళ్లచెరువు పంచాయతీ రాజ్ రోడ్డుకు ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాధరాజు చొరవతో నేటికి మోక్షం కలిగింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం రూ.15 లక్షలతో నిర్మించనున్న రహదారి పనులను సర్పంచి సరోజినీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. రోడ్డు కల నేటికి నెరవేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జగన్నాధరావు, ఎంపిటిసి జ్యోతి రామాంజనేయులు, కుక్కల కిరణ్, గెద్దాడ విశ్వేశ్వరరావు, కామన హరిబాబు, బండి మహేష్, గుబ్బల రామకృష్ణ పాల్గొన్నారు.










