అనంతపురం కలెక్టరేట్ : పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఆ మేరకు జిల్లాలో వంద శాతం గృహ నిర్మాణాల పనులను పూర్తి చేయించే దిశగా గృహ నిర్మాణ శాఖ అధికారులు పని చేయాలని జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ కోరారు. రాష్ట్ర గహ నిర్మాణ సంస్థ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అనంతపురం అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కనీస మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైనది ఇల్లు అన్నారు. అలాంటి ఇళ్ల నిర్మాణాలు చేయించే విధుల్లో ఉన్న హౌసింగ్ ఉద్యోగుల సేవలు అభినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేసి, కట్టించి ఇవ్వడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దీనికి అనుగుణంగానే గహ నిర్మాణ శాఖ అధికారులు సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. నిర్ధేశించిన లక్ష్యాలను సాధించడంలో గహ నిర్మాణ శాఖ అధికారుల సిబ్బంది నిబద్దతతో పనిచేసే జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. జులై మాసం చివరిలోపు అనంతపురం జిల్లాలో 20 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో భాగంగా ఇప్పటికే 16 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం శుభపరిణామం అన్నారు. మిగిలిన ఇళ్లను కూడా అనుకున్న సమయంలోపు పూర్తి చేయించి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే పూర్తయిన గహ నిర్మాణాలను ఆగస్టు మాసంలో మెగా గహప్రవేశాలకు సిద్ధం చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని కోరారు. అనంతరం గహ నిర్మాణ సంస్థ ఉద్యోగులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేశవ నాయుడు, ఈఈ సత్యనారాయణ, మేనేజర్ మద్దయ్య, డీఈలు కష్ణారావు శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణమ్మ, శైలజ, ఏఈ కొండభూషణ్, అసిస్టెంట్ మేనేజర్ అల్తాఫ్ హుస్సేన్, హౌసింగ్ శాఖ ఏఈలు, వర్క్ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.










