Oct 17,2023 21:40

ఫొటో : మేనిఫెస్టోను అందజేస్తున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

వలంటీర్లే కీలకం : మేకపాటి
ప్రజాశక్తి-ఉదయగిరి : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడం, వారి కలలు సహకారం చేసేందుకు వలంటీర్లే కీలకమని సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కొండాయపాలెం పంచాయతీ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు వెంకట్రావుపల్లి, గానుగుపెంటపల్లి, దుర్గంపల్లి గ్రామాల్లో వైసిపి మండల కన్వీనర్‌ సిఎం ఓబుల్‌ రెడ్డి విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా గడపగడప జరుగుతూ జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవాని ప్రజలను ఆరా తీశారు.
దుర్గంపల్లి ప్రజలు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల లివర్‌ వ్యాధితో మృతి చెందిన బకీరు వెంకటాద్రి కుటుంబానికి రూ.25 వేల నగదును ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డికి ప్రతి గడపలో ఆదరాభిమానాలు వెల్లువెత్తుతున్నాయని ప్రతి ఒక్కరూ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి కావాలని ఆశీర్వదిస్తున్నారన్నారు. 2024లో రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే వలంటీర్లతో సమీక్షించి రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత వలంటీర్లపై ఉందన్నారు. అది అమలు చేసే విధానంలో సచివాలయ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందించాలని అర్హులైన ప్రతి ఒక్కరికీ జగన్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందాలని అందని వారు ఉండకూడదని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగూర్‌ బీ, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు గాజుల తాజుద్దీన్‌, మాజీ జెడ్‌పిటిసి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మండల కన్వీనర్‌ అక్కి భాస్కర్‌ రెడ్డి, నాయకులు అశోక్‌ కుమార్‌ ఇత్తడి రమణయ్య, గురవయ్య, ఎపి ఎంఆర్‌పిఎస్‌ నాయకులు నల్లిపోగు ప్రసాద్‌, కిషోర్‌, మనీష్‌, కాకర్ల అబ్దుల్లా, సచివాలయ కన్వీనర్‌ భాషా, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.