ఆచంట :రైతు సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న ఏకైక నాయకులు ముఖ్యమంత్రి జగన్ అని ఎఎంసి ఛైర్మన్ చిల్లే లావణ్య అన్నారు. వల్లూరు సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం చిల్లే లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతు ఖాతాలో నగదు జమ చేసే విధంగా కృషి చేస్తామన్నారు. రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు నారిన వీర వెంకట సత్యనారాయణ, డైరెక్టర్లు గంగోలు శ్రీనివాసరావు పాల్గొన్నారు.










