Feb 27,2023 20:53

ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో జరుగుతున్న వివాహాలన్నీ రిజిస్ట్రేషన్‌ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జరిగే వివాహాలన్నీ విధిగా రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ప్రజలను చైతన్య వంతులు చేయాలన్నారు. ప్రతి వారమూ ఎన్ని వివాహాలు జరిగాయి, ఎన్ని వివాహాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయినీ అధికారులను ఆరా తీశారు. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే నిలుపుదల చేసి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పిఎంఎవై గృహాలు రిజిస్ట్రేషన్‌ చేశారో లేదో పరిశీలించి నివేదిక అందించాలని తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, డిపిఒ ఎం.నాగలత, డిఎల్‌డిఒకెసి హెచ్‌.అప్పారావు, భీమవరం డిఎస్‌పి బి.శ్రీనాథ్‌ పాల్గొన్నారు.