అధికారులతో మాట్లాడుతున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.రవి
ప్రజాశక్తి-అనంతపురం ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ వేరుశనగ కాయల నాణ్యతలో రాజీపడొద్దని అనంతపురం వ్యవసాయ డివిజన్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.రవి సూచించారు. మంగళవారం నగరంలోని విజయ ఆగ్రో ఏజెన్సీ, నందీశ్వర సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందించే విత్తన వేరుశనగ కాయల విషయంలో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ వేరుశనగ కాయలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎడిఎ రవి, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










