జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్
ప్రజాశక్తి-అనంతపురం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసే విత్తన వేరుశన కాయల నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దని జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలో సబ్సీడీ వేరుశనగ ప్రాసెసింగ్ చేస్తున్న ప్లాంట్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.చంద్రానాయక్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఖరీఫ్ సాగుకు నాణ్యమైన వేరుశనగ కాయలు అందించాలన్నారు. విత్తన పంపిణీ ఈనెల చివర్‌లో ఉంటుందని, అంతలోపు ప్రాసెసింగ్ చేసిన కాయలను మండలాల్లోని రైతు భరోసా కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎపి సీడ్స్ మేనేజర్ ధనలక్ష్మి, అనంతపురం ఏవో ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










