Sep 17,2023 22:57

'విశ్వకర్మ'కు ఘన నివాళి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17న శ్రీ విరాట్‌ విశ్వకర్మ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ అని జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్‌ స్పందన హాల్‌లో బీసీ సంక్షేమశాఖ చిత్తూరువారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీవిరాట్‌ విశ్వకర్మ జయంతి వేడుకలలో జెసి పి.శ్రీనివాసులు, బిసి సంక్షేమ శాఖ అధికారి ఎస్‌ కె.రబ్బానీ బాషా పాల్గొని, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17 న శ్రీవిరాట్‌ విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నామని తెలిపారు. లోకంలోని రకరకాల వత్తులకు ఆద్యుడైన శ్రీవిరాట్‌ విశ్వకర్మని తెలిపారు. విశ్వకర్మ వల్లే చేతివత్తులు అభివద్ధి చెందాయన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి బి.కులశేఖర్‌, జిల్లా బీసీ సంక్షేమశాఖ కార్యాలయలయం సూపరింటెండెంట్‌ జె.శ్రీనివాసులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వాసంతి, బిసి సంక్షేమ వసతి గహ సంక్షేమ అధికారులు రాజశేఖర్‌, కోటేశ్వరులు, కరుణ, జిల్లా బీసీ కార్పొరేషన్‌ చిత్తూరు కార్యాలయపు సిబ్బంది , కలెక్టర్‌ కార్యాలయం సిబ్బంది పాల్గొని విశ్వకర్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.