ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ విశ్వకర్మ వల్లే చేతివృత్తులు అభివృద్ధి చెందాయని అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ అన్నారు. ఆదివారం నగరంలోని పాతూరు బ్రహ్మంగారి గుడిలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కత్తి, సుత్తి, కొడవలి లాంటి చేతి వత్తుల పరికరాలు విశ్వకర్మ తయారు చేశారని గుర్తు చేశారు. అంతేగాకుండా ఎన్నో దేవతా విగ్రహాలకు రూపాన్ని ప్రపంచానికి విశ్వకర్మ ఇచ్చారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివత్తుల వారికి ఉపాధి కల్పిస్తున్నారని, వారి కోసం అనేక రకాల పథకాల ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చేతివృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, డిసిసిబి ఛైర్ పర్సన్ లిఖిత, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్‌పర్సన్ నాగరత్నమ్మ, ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ మంజుల, వక్ఫ్ బోర్డు జిల్లా ఛైర్మన్ రిజ్వాన్, బిసి కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, బిసి వెల్ఫేర్ డిడి ఖుషఉ్బ కొఠారి, తహసీల్దార్ శ్రీధర్ మూర్తి, ప్రముఖ న్యాయవాది గురు ప్రసాద్, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి నాగభూషణం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
పూజలు చేస్తున్న జెసి కేతన్‌గార్గ్, ఎమ్మెల్యే అనంత










