ప్రజాశక్తి-ఆత్మకూరు జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ ఎం.గౌతమి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద ఉన్న నగరవనంలో ఐఎఎస్ ఆఫీసర్స్ వైవ్స్ అసోసియేషన్ (ఐఎఎస్‌ఓడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో చేపట్టిన మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా జిల్లాలో 57,450 వేల వరకూ మొక్కల పెంపకం చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని పంపనూరు వద్ద నగరవనంతోపాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం, ఎస్కే యూనివర్సిటీ, పెద్దవడుగూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, కూడేరు మండలంలోనిబసంపురం ఆంజనేయ స్వామి దేవాలయం, రాయదుర్గం వద్దనున్న నగరవనం, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో, బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు వద్దనున్న సెంట్రల్ యూనివర్సిటీలో, సిద్ధరాంపురం వెటర్నరీ లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్, రెడ్డిపల్లి ఓపెన్ జైల్ నుంచి జంతలూరు రోడ్డు పరిధిలో, వజ్రకరూరు మండలంలోని కొత్తకోట జడ్పీహెచ్ పాఠశాల ప్రాంగణంలో, కుందుర్పి మండలం కరిగానిపల్లి వద్ద, తదితర 30 ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్, భార్య డా.రిషిఖ, డీఎఫ్‌ఓ సందీప్ కృపాకర్, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్‌ఓ చంద్రశేఖర్ బాలాజీ, ఆర్డీవో మధుసూదన్, ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసులు, డిఆర్‌ఓ హుసేనప్ప, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దామోదర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫ్లారెన్స్ దీప, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరులో మొక్క నాటి నీరు పోస్తున్న కలెక్టర్ ఎం.గౌతమి










