Mar 23,2023 22:35

గుత్తిలో భగత్‌సింగ్‌కు నివాళి అర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-గుత్తి      విప్లవ వీరుడు భగత్‌ సింగ్‌ 93వ వర్థంతిని ఎస్‌ఎఫ్‌ఐ, జేవీవీ, భగత్‌సింగ్‌ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో గుత్తిలో గురువారం నిర్వహించారు. స్థానిక ఏపీ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న భగత్‌సింగ్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్‌ భగత్‌సింగ్‌, భగత్‌ సింగ్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్‌, జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు శ్రీధర్‌ గౌడ్‌, భగత్‌సింగ్‌ యూత్‌ కమిటీ సభ్యుడు నిజామొద్దీన్‌ మాట్లాడుతూ దేశ భక్తి భావం పెంపొందించేందుకు యువతకు భగత్‌సింగ్‌ ఆదర్శం అన్నారు. అంతరాలు, అసమానతలు లేని సమాజం నిర్మించడమే భగత్‌సింగ్‌ ఆశయం అన్నారు. భగత్‌ సింగ్‌ భారతదేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడి బ్రిటిష్‌ వారి చేతుల్లో ఉరి తీయబడ్డరని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం : పట్టణంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఎఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ వర్ధంతిని నిర్వహించారు. రాయదుర్గం డివిజన్‌ అధ్యక్షులు కుమార్‌ నాయక్‌ భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భగత్‌సింగ్‌ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, భగత్‌సింగ్‌ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు అట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి లీమా రోజ్‌, ఎఐవైఎఫ్‌ మండల కార్యదర్శి అనిల్‌కుమార్‌, చందు, నిఖిల్‌, వీరేష్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.