వినాయకునికి రూ.2లక్షలు విరాళం
ప్రజాశక్తి- ఐరాల
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ది వినాయక స్వామి వారి నిత్యఅన్నదాన పథకానికి, గో సంరక్షణ ట్రస్ట్‌కు శనివారం మదనపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి, కుమార్‌స్వామి రెడ్డి దాతలు రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు . ఈ విరాళ దాతలకు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేసారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.










