వినాయకుని సేవలో రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్
ప్రజాశక్తి - ఐరాల: స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. దర్శనార్థం విచ్చేసిన ఆయనకు ఆలయాధికారులు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాలు అందజేశారు. ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఉన్నారు.










