వినాయకుని హుండీ లెక్కింపు
రూ.2,07,13,581లు ఆదాయం
ప్రజాశక్తి- ఐరాల: కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ కానుకలను స్వామివారి ఆస్థాన మండపంలో 23రోజులు తరువాత బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కించడం జరిగింది. ఇందులో రూ.2,07,13,581లు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సురేష్ బాబు, ట్రస్టుబోర్డు ఛైర్మెన్ ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు. హుండీలో 85 గ్రాముల బంగారం, వెండి 1కిలో 450 గ్రాములు, పారేన్ కరెన్సీ యుఎస్‌ఎ 336 డాలర్స్, యూరో 10 యురోస్, కెనడా20 డాలర్స్, సింగపూర్10 డాలర్స్, మలేషియా 57 రిగిట్స్ద, ఇంగ్లాండ్ 150 పౌండ్స్, బిచ్చండి హుండీ14.685లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, విద్యాసాగర్ రెడ్డి, కష్ణారెడ్డి, రవ్రీంద్రబాబు, సూపరిటెండెంట్లు శ్రీధర్, బాబు, కోదండపాణిలతోపాటు ఆలయ సిబ్బంది, కాణిపాకం యూనియన్ బ్యాంక్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.










