వినాయకుని హుండీ ఆదాయం కోటి 3లక్షలు
ప్ర్రజాశక్తి- ఐరాల: కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ కానుకలను స్వామివారి ఆస్థాన మండపంలో 21రోజులు తరువాత మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కించడం జరిగింది ఇందులో రూ.1.03.26.304లు ఆదాయం వచ్చినట్లు ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్ ఎ.మోహన్ రెడ్డి, ఆలయ ఈఓ సురేష్‌బాబులు తెలిపారు. అందులో బంగారు 35 గ్రాములు, వెండి 460 గ్రాములు, పారేన్ కరెన్సీ యుఎస్‌ఎ 1387 డాలర్స్, యూఏఈ 160, ధీరమ్ కెనడా 95 డాలర్, ఆస్ట్రేలియా195 డాలర్స్, సింగపూర్ 12 డాలర్స్ వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు నరసింహులు శెట్టి, మారుతీశ్వరరావు, కాంతమ్మమ, రామసుబ్బమ్మ, చిత్తూరు దేవాదాయశాఖ ఏసి ఏకాంబరం, సుశీల, శుభలక్ష్మమ్మ, ఎఈఓలు విద్యాసాగర్ రెడ్డి, ఎస్వీ కష్ణారెడ్డి, రవ్రీంద్రబాబు సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణిలతోపాటు ఆలయ సిబ్బంది, కాణిపాకం యూనియన్ బ్యాంకు శాఖ అధికారులు పాల్గొన్నారు.










