
* ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : విలువలతో కూడిన జర్నలిజం అవసరమని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని గురువారం సందర్శించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని, అందులో భాగంగా రాజధాని కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోందని, ఇప్పటికే 600 మీటర్ల మేర సముద్రంలోకి జెట్టీ మార్గం వేశారని ప్రభుత్వం నిర్మించిందని తెలి పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పోర్టు పను లు పూర్తవుతాయన్నారు. మత్స్యకారుల వలసల నివారణకు ఈ పోర్టు ఉపయోగపడుతుందని చెప్పారు.
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
జర్నలిజాన్నే వృత్తిగా చేసుకొని, నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు సొంతింటి కల నేరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారరని అన్నారు. రాష్ట్రంలో అర్హులై ఉండి, గతంలో ఎన్నడూ ఇంటి స్థలం గానీ, ఇళ్లు గానీ పొందని నిరుపేద జర్నలిస్టులకు కేటా యించనున్నట్టు తెలి పారు. సమాజంలో సముచితమైన గుర్తిం పు, గౌరవం జర్నలిస్టులకు ఉంటుందన్నారు.