చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని వైఎస్‌ఆర్సిపి లీగల్ సెల్ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం న్యాయవాదులు స్పష్టం చేశారు. మూడు రాజధానుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు అభివద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్‌ఆర్సిపి లీగల్ సెల్ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు సూర్య ప్రతాప్ రెడ్డి , చిత్తూరు నగర ఉప మేయర్ చంద్రశేఖర్ , వైఎస్‌ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సుగుణ శేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ..కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడాన్ని సమర్థిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో అన్ని ప్రాంతాల అభివద్ధిని దష్టిలో ఉంచుకొని మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్‌ఆర్సిపి లీగల్ సెల్ సభ్యులు కిషోర్ రెడ్డి, కన్నా, వాసురెడ్డి , తదితరులు పాల్గొన్నారు.










