Jun 03,2023 22:23

విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌, ఎస్పీ శ్రీనివాసులు

            కళ్యాణదుర్గం : ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా తలపెట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంతోపాటు జగనన్న ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేయనున్న విజయోత్సవ సభను జయప్రదం చేయాలని మంత్రి ఉషశ్రీచరణ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని కుందుర్పి రోడ్డులో ఆదివారం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయం సిఎం జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. గడప గడపకూ తాము వెళ్లినప్పుడు సంక్షేమ ప్రజల కళ్లల్లో కనిపిస్తోందన్నారు. కావున విజయోత్సవ సభలో జిల్లావ్యాప్తంగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాగా విజయోత్సవ సభ ఏర్పాట్లను ఎస్పీ కె.శ్రీనివాసులు పరిశీలించారు. ఇందులో భాగంగా సభా ప్రాంగణం, భోజన స్టాల్స్‌ తదితర ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.