Aug 18,2022 23:36

సాంసృతిక కార్యాక్రమాల్లో విద్యార్థులు

చిత్తూరు అర్బన్‌: స్థానిక గంగనపల్లి క్యాంఫర్డ్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల్లో గురువారం శ్రీ కృష్ణష్టామివేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంసృతిక కార్యాక్రమాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృష్ణుడి వేషదారణ, సాంప్రదాయ దుస్తులు ఆకట్టుకున్నాయి. పాఠశాల కరెస్పాండెంట్‌ సిఆర్‌ మహేష్‌ మాట్లాడుతూ కృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలను చూడముచ్చటగా ఉన్నాయని అభినందించారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీతాశేఖర్‌ పాల్గొన్నారు.
సుందరరాజపురంలోని విజయం సిబిఎస్‌ఇ స్కూలు, మిట్టూరులోని విజయం ది స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజామూర్తి మాట్లాడుతూ పిల్లల్లో సంస్కృతిని పెంపొందించడానికి తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.