Oct 25,2023 22:52

వి జల్లుపుట్టుగలో కొత్తగా వేసిన సిసి రోడ్డు

* ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి- కవిటి: 
గతుకుల రోడ్డు...ముల్లపొదలు అనే శీర్షిక అక్టోబర్‌ 2న ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు నాయకులు స్పందించారు. కవిటి మండలం వి.జల్లుపుట్టుగ గ్రామంలో ప్రధాన రహదారి చినుకు పడితే చిత్తడిగా మారుతోందని, వర్షం సమయంలో దమ్ముమడిని తలపించేలా ఉంటున్న రోడ్డుతో స్థానికులు అవస్థలు పడుతున్నట్టు ప్రజాశక్తి వార్త ప్రచురించింది. దీనికి స్పందించిన స్థానిక సర్పంచ్‌ కిరణ కుమారి, ఎంపిటిసి పూర్ణచంద్రరావు, కవిటి మండల ఎంపిపి కడియాల పద్మప్రకాష్‌ సహకారంతో మండల పరిషత్‌ నిధులు రూ.1.50 లక్షలతో సిసి రోడ్డు నిర్మించారు. అంతేకాకుండా సర్పంచ్‌ ప్రతినిధి జయప్రకాష్‌ నారాయణ, ఎంపిటిసి పూర్ణచంద్రరావు దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. దీనిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.