Mar 17,2023 20:54

ప్రజాశక్తి - వీరవాసరం
కొంత కాలంగా ఆలస్యమవుతూ వస్తున్న వీరవాసరం పంచాయతీ షాపుల వేలం పాట శుక్రవారం నిర్వహించారు. పాటదారులు, స్థానికులు అభ్యంతరాల మధ్య సాగిన ఈ వేలం పాట పట్ల అధికారుల వైఖరి పట్ల ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పంచాయతీ నిర్ధేశించిన కనీసపు పాట ధర నిర్ణయం పట్ల అధికారుల గుట్టుగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. మొత్తం పద్నాలుగు షాపులకు గాను రెండు షాపులు వాయిదా పడగా పన్నెండు షాపులను వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ విధంగా షాపుల ద్వారా మూడు సంవత్సరాల కాలపరిమితితో పంచాయతీకి మొత్తం రూ.57.66 ఆదాయం సమకూరింది. గతం కంటే ఈ సారి అదనంగా రూ. 19.94 లక్షల ఆదాయం పెరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచి చికిలే మంగతాయారు, కార్యదర్శి జెడివి. ప్రసాదు, ఇఒపిఆర్‌డిలు పాల్గొన్నారు.