విధిగా చేతులు శుభ్రం చేసుకోవాలి
వాల్‌పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. శనివారం ఉదయం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రధానంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు బాలింతలు ప్రజలకు ఈకార్యక్రమం పైన అవగాహన కల్పించాలన్నారు. అలాగే కౌమార దశలో ఉన్న పిల్లలు ఆరోగ్యం దష్ట్యా వారి తల్లులు మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అవగాహన చర్చా లేదా ప్రదర్శనల ద్వారా లేదా మదర్స్ కమిటీ సమావేశాలలో తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేలా చూడాలని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఉంటున్న అంగన్వాడీ శిశువిహార్ పిల్లల సంరక్షణ సంస్థలు ఈ హ్యాండ్ వాష్ గురించి మరింత జాగ్రత్త వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఐసిడిఎస్ అధికారిని నాగ శైలజ, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, ఆర్డబ్ల్యూఎస్ అధికారిని జ్యోతి, డాక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.










