Nov 14,2022 23:36

సిబ్బందితో మాట్లాడుతున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌

విధి నిర్వహణలో అలసత్వం వద్దు
అసిస్టెంట్‌ కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
అఖిల భారత సివిల్‌ సర్వీస్‌ శిక్షణలో భాగంగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ వై.మేఘ స్వరూప్‌ సోమవారం నగరపాలక కార్యాలయానికి విచ్చేశారు. వత్తిపరమైన శిక్షణలో భాగంగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ వారం రోజులపాటు నగరపాలక కార్యాలయంలో పాలనాపరమైన అంశాలపై అవగాహన పెంచుకోనున్నారు. నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ అసిస్టెంట్‌ కలెక్టర్‌కు నగరపాలక సంస్థపరిధిలో విభాగాలకు సంబంధించి పాలనాపరమైన అంశాలను వివరించారు. ప్రధానంగా స్పందన వినతుల పరిష్కారం, రికార్డుల నిర్వహణ, రెవెన్యూ, పురపాలకశాఖకు సంబంధించిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, మేనేజర్‌ ఉమామహేశ్వర్‌ రెడ్డి, మెప్మా సీఎంఎం గోపి పాల్గొన్నారు.