Dec 14,2022 21:42

విద్యుత్‌ పొదుపు అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న జెసి

విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి
అవగాహన ర్యాలీలో జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
విద్యుత్తును పొదుపుగా వాడుకుంటేనే భావితరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. బుధవారం ఉదయం చిత్తూరులోని కట్టమంచి చెరువు వద్ద గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద జాతీయ పొదుపు వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ భావితరాలకు ఇబ్బందికర పరిస్థితులు లేకుండా విద్యుత్తును ఉపయోగించుకోవాలంటే మనం విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, పొదుపు చాలా అవసరమని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రధానంగా జిల్లాకు చెందిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్‌ శాఖ మంత్రిగా అంతరాయం లేని విద్యుత్‌ను గహాలకు ఇవ్వడం జరుగుతోందన్నారు. అదేవిధంగా వ్యవసాయ సర్వీసులకు 9గంటలు నిరంతరాయంగా ఇస్తూ ఉండడం జరుగుతుందని అయినా పొదుపుగా వాడుకుంటే భావితరాలకు ముప్పులేని విద్యుత్తును అందించగలమని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శ్రీహరి, ఉద్యోగులు పాల్గొన్నారు.