Aug 02,2023 22:07

విద్యుత్‌ ఎఇకి వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

      అనంతపురం కలెక్టరేట్‌ : రాజీవ్‌ కాలనీ పంచాయతీ గణేనాయక్‌ కాలనీలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని, మహదేవ్‌ నగర్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ ఎత్తు పెంచాలని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం సిపిఎం నాయకులు, కాలనీ వాసులతో కలిసి విద్యుత్‌ శాఖ డి5 కార్యాలయం ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో ఇళ్లపై ఉన్న విద్యుత్‌ తీగలను తొలగించి ప్రమాదాల జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజీవ్‌ కాలనీ ఉప సర్పంచ్‌ మసూద్‌, ఎంపీటీసీ సభ్యురాలు రమీజాబీ, సిపిఎం నాయకులు బాబు, డేవిడ్‌, పెద్ద మసూద్‌, వన్నురు, శ్రీనివాసులు, రాము, నరసింహారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.